|
Lyrics Dew బ్లాగ్ తెలుగు భాషలో అన్ని రకాల పాటలతో, ఈనాడు మీ ముందు నిలిచింది. మహా మహనీయులైన గాయనీ గాయకులూ, సంగీత దర్శకులు, చిత్రకారులు, సాహితీవేత్తలూ మొదలగు వారందరూ నిర్మించిన పాటల సరాగాలను మీ ముందు ఉంచేందుకే ఈ మా చిన్ని ప్రయత్నం. గొప్ప గొప్ప పాటలోతో, గొప్ప గొప్ప వాళ్ళందరూ మన తరాలవారికి తెలుగు పాటలను ఒక సంపత్తుగా ఇచ్చిన ఆ పాటలన్నిటిని ఒక చోటికి చేర్చి మీకందిస్తున్నాం. రకరకాల అభిరుచులుగల అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని వివిధ రకమైన పాటలను ఇందులో పొందుపరిచాము. వివిధ కళలు గల గొప్ప గొప్ప సాహితీవేత్తలూ, సంగీత దర్శకులు, గాయనీ గాయకులూ, చిత్రదర్శకులు, మొదలగు కళాకారుల పాటలన్నీ మీ ముందుకు తీసుకువచ్చాము.
|
| "నీలో పాడగలిగిన కళను బయట పెట్టు. |
| అదే నిన్నునిజమైన గాయకునిగా తీర్చి దిద్దుతుంది. |
| అలాంటి అవకాశం ఎప్పుడూ వదలకు. |
| అది ఖచ్చితంగా మా Lyrics Dew సహకారంతో తప్పకుండా సాధ్యమౌతుంది. " |
|
ముఖ్యంగా పాటల పోటీల్లో పాల్గొనే వాళ్ళు, వారి కళను నిరూపించుకోవటానికి ఇది ఒక సులువైన మార్గమని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందులో ఒక పాటను పూర్తిగా వ్రాసివుండటం వల్ల, ప్రదర్శన ఇచ్చే సమయంలో, పాడేవారు కూడా మంచి మంచి ప్రసంశలను అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాటలు ఎంత సులువుగా పాడాలో, ఎంత సులువుగా పాడవచ్చో ఇందులో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు.
|
|
పాటను పాడేవారు సైతం ప్రతిపాటను పూర్తిగా నేర్చుకోవటానికి అనువుగా, అన్ని విషయాలను సాధ్యమైనంతవరకు ప్రతి పాటలోను పొందుపరచాము. ఈ బ్లాగ్లో వున్న ప్రతి ఒక్క పాటకి ఒక్కొక్క ప్రత్యేకత వుంది. ప్రతి అక్షరానికి ఒక్కో అర్థం వుంది.ప్రతిపాటలోను ఆయా చిత్రానికి సంబంధించిన విషయాలు, ఇంకా ఎంత అవకాశం దొరికితే అంతా, ఈ పాటలన్నింటిని ఆంగ్లములోనికి అనువదించటానికి మా వంతు కృషిని చేసాము, ఇంకా చేస్తున్నాము కూడా . ఈ పాటలన్నిటిని మీ గాత్రంతో పాడి, అందరిని అలరించి వారి వారి ప్రశంసలను పొందగలరన్నదే మా ఆకాంక్ష . పాడాలనుకున్న వారికి, పాటలను నేర్చుకోవాలి అనుకున్న వారికి మరింత ఎక్కువగా ఉపయోగపడటమే ఈ మా ప్రయత్నమని చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాం.
|
|
ఇంకా ఎన్నో పాటలకోసం, Lyrics Dew దర్శించగలరు.
|
| Lyrics Dew తెలుగు పాటల కోసం, ముఖ్యంగా పాటలంటే అభిరుచి ఉన్నవాళ్లకు, వాటిని ఇంకా ఇష్టంగా పాడాలని అనుకున్న వాళ్ళ కోసం నిర్మించబడినది. ఇందులో ఉన్న పాటలు చాలా సులువుగా పాడటానికి, పాటలు నేర్చుకోవటానికి, ఒక పాటను ఎలా ప్రదర్శించాలో అన్ని వివరాలతో క్లుప్తంగా వ్రాయబడినది. ప్రతీ పాటకు దాని దాని ప్రాముఖ్యత, ఆయా పాటల సాహిత్యంలో స్పష్టంగా నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి పాటలు తరాల వారికి మంచి సాహిత్యాన్ని, మంచి సంగీతాన్ని అందజేస్తాయి.ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక మనసులోని బాధను, సంతోషాన్నీ, ప్రేమను, ద్వేషాన్ని, ఆనందాన్ని, కోపాన్ని, ఒక బంధాన్ని కాని, అనుబంధాన్ని కానీ, చెప్పటానికి ఒక పాట మంచి ఉదాహరణ అవుతుంది. |
| సాహిత్యం మరియు సంగీతం, ఈ రెండు పదాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక మధురమైన అనుభూతినిస్తాయి. మరి కొందరికి చేదు నిజాలను కూడా తియ్యని జ్ఞాపకాలుగా మిగులుస్తాయి.తాము పాడే పాటకు ప్రాణం పోస్తాయి.మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనకు అర్ధమయ్యే భాషలో, ఇంకా చెప్పాలంటే మన వాడుక భాషలో అర్థం అవ్వాలంటే, అందుకు ఒక పాట చాలా మంచి ఉదాహరణ. |
| ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది ............. |
| ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది...................... |
| ఒక పాట మనల్ని నవ్విస్తుంది............................... |
| ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది............................... |
| ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది.................... |
| ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది............... |
| ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది...................... |
| ఒక పాట మనకు జోల పాడుతుంది.......................... |
| ఒక పాట మన నేస్తం అవుతుంది............................. |
| ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది.................. |
| ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది.................. |
| ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!! |
|
| అన్నిటా ముఖ్యమైన విషయాన్ని తెలపటానికి చాలా సంతోషిస్తున్నాము. ఇందులో వ్రాసిన ప్రతిఒక్క పాటలోనూ కోరస్ (chorus) సాహిత్యాన్ని కూడా అందిస్తునామని గర్వంగా తెలియజేస్తున్నాం. పాటలను ఎంతో ఇష్టంగా పాడాలి అనుకున్న వాళ్లకోసం, పాటలని ఎంతో బాగా పాడాలి అనుకున్న వాళ కోసం, మేము ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టటానికి ముఖ్య కారణం. అందుకే పాటలను సంపూర్ణంగా పాడటానికి మా వంతు కృషి చేసి ప్రతి పాటల్లోనూ కోరస్ ను కూడా అందిస్తున్నాము. |
| సందర్భాలు అనేకం. కొందరు ఒక పాటను బాగా పాడగలరు. కానీ, వారికి ఆ పాట సాహిత్యం సరిగా తెలిసి వుండదు. కొందరు పాట సాహిత్యం తెలిసినా, ఆ పాటను ఎలా పాడాలో తెలియక సతమతమౌతారు. కొందరు పాట ఎలా పాడాలో తెలిసినా, ఆ పాటలోని హావభావాలను వ్యక్తపరచలేరు. మరి కొందరు ఇవన్నీ తెలిసినా, ప్రదర్శన ఇచ్చే సమయంలో ఏవీ చెయ్యలేక తికమక పడతారు.అటువంటి కొన్ని ప్రశ్నలకు, కొన్ని సమస్యలకు ఈ మా సమాధానమే Lyrics Dew. మీరు చూసిన, చూస్తున్న,చూడబోయే సమస్యలకు జవాబులుగా, అటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా ఈ బ్లాగ్లో పాటల సాహిత్యాన్ని అందిస్తున్నాం. ఇందులో, ఒక పాటను ఎంత మధురంగా, ఎంత సులువుగా, ఎంత వినసొంపుగా పాడవచ్చో, అలాంటి సాహిత్యాన్ని మీకు అందిస్తున్నాం. ఈ బ్లాగును ఒక ప్రత్యకమైన అంశంతో మొదలు పెట్టి అందరి ప్రేక్క్షకులను, వారి పాటల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని, మా ప్రేక్షకులను అలరించటానికి రకరకాల పాటలతో ఈనాడు మీ ముందుకు తీసుకువచ్చాము . దీన్ని మీరు ఆదరిస్తారని, ఆదరింపజేస్తారని ఆశిస్తున్నాం. |
| " మీ ఊహలను నిజం చెయ్యటానికి, ఆశయాలను అందుకోవటానికి, వాటిని నిరూపించటానికి మావంతు పాటల సాహిత్యాన్ని అందిస్తున్నాం..... మీకోసం……..!!! " |
|
| మరెందుకు ఆలస్యం ....?? ఈ బ్లాగులో ఉన్న ప్రత్యేకమైన పాటలకి, అందులో ఉన్న సాహిత్యానికి మీ వంతు స్వరాన్ని చేర్చి మీ గళాన్ని, మీలోని గానానికి కలిపి, మీలో దాగివున్న గాయనీ గాయకులకు ప్రాణం పోయండి. పాట పాడటంలో మీకు ఉన్న ప్రత్యేకతను తెలపండి. ఈ మీ చిన్ని ప్రయాణం సాగించి, పాటల ప్రపంచంలో విహరించడానికి, పలువురి పాటలతో ప్రయాణం సాగించడానికి మా వంతు సహాయం అందిస్తున్నాము. మరికొన్ని అద్భుతమైన పాటలకోసం మేము అందించిన సాహిత్యానికి మీ గళాన్ని కలపడంకోసం మళ్ళీ మా పాటల రథసారథి అయిన Lyrics Dew కు విచ్చేయండి. |
| " ఎల్లప్పుడూ, మేము అందించే పాటల సాహిత్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మా పాటల సాహిత్యాన్ని ఆదరించి, మీ మంచి మనసుతో విస్తరింపజేస్తారని ఆశిస్తున్నాం." |
|
| Note: ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరినీ ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు. |
| మీ గానం కోసం..., మా... Lyrics Dew...!!! |
|
| Lyrics Dew కు స్వాగతం...!!! |
|
| కృతజ్ఞతలు |
| మీ |
| Lyrics Dew & Team |
|
|
ఈ వర్గానికి చెందిన అన్ని పాటలను
Lyrics Dew ఇక్కడ జతపరిచి మీ ముందు తీసుకు వచ్చింది.
" పాటకు ప్రాణం, నిజమైన మనస్సుతో పాడటం. అది తప్పకుండా ఇక్కడ సాధ్యం. " కాలంలో జరుగుతున్న మార్పులూ, ఒకప్పటి పాటల సాహిత్యానికి, ఇప్పుడు వస్తున్న పాటల సాహిత్యానికి ఉన్న తేడాలను మనం కొన్ని పాటల సాహిత్యంలో స్పష్టంగా గమనించవచ్చు.
| " ఒక మంచి మాట మన మనసును ఆలోచింపజేస్తుంది. " |
| " ఒక మంచి పాట మనలోని నిజమైన గాయకులను వెలికి తీస్తుంది. " |
తెలుగు పాటలలో అన్నిరకాల పాటలను అందరూ ఇష్టపడకపోవచ్చు. కొందరు అన్నీ ఇష్టపడనూవచ్చు. రకరకాల పాటలు రకాల మనస్తత్వాల్ని ఆకర్షిస్తాయి. ప్రేక్షకుల్ని, ప్రేక్షకుల పాటల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గానికి చెందిన పాటల సాహిత్యాన్ని ఆయా పేర్లతో విభజించి మీ ముందుకు తీసుకువచ్చాము. అందువల్ల మీరు ఇష్టపడే పాటల వర్గాన్ని చాలా సులువుగా ఎంచుకుని సాధన చెయ్యవచ్చు.
Lyrics Dew లోని
పాటల సాహిత్యం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం.... పదండి, ఒక రాగాన్ని పాడదాం...!!!
Movie Name & Song Name