" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Welcome to Lyrics Dew

Lyrics Dew తెలుగు పాటల కోసం, ముఖ్యంగా పాటలంటే అభిరుచి ఉన్నవాళ్లకు, వాటిని ఇంకా ఇష్టంగా పాడాలని అనుకున్న వాళ్ళ కోసం నిర్మించబడినది. ఇందులో ఉన్న పాటలు చాలా సులువుగా పాడటానికి, పాటలు నేర్చుకోవటానికి, ఒక పాటను ఎలా ప్రదర్శించాలో అన్ని వివరాలతో క్లుప్తంగా వ్రాయబడినది. ప్రతీ పాటకు దాని దాని ప్రాముఖ్యత, ఆయా పాటల సాహిత్యంలో స్పష్టంగా నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి పాటలు తరాల వారికి మంచి సాహిత్యాన్ని, మంచి సంగీతాన్ని అందజేస్తాయి.ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక మనసులోని బాధను, సంతోషాన్నీ, ప్రేమను, ద్వేషాన్ని, ఆనందాన్ని, కోపాన్ని, ఒక బంధాన్ని కాని, అనుబంధాన్ని కానీ, చెప్పటానికి ఒక పాట మంచి ఉదాహరణ అవుతుంది.
సాహిత్యం మరియు సంగీతం, ఈ రెండు పదాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక మధురమైన అనుభూతినిస్తాయి. మరి కొందరికి చేదు నిజాలను కూడా తియ్యని జ్ఞాపకాలుగా మిగులుస్తాయి.తాము పాడే పాటకు ప్రాణం పోస్తాయి.మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనకు అర్ధమయ్యే భాషలో, ఇంకా చెప్పాలంటే మన వాడుక భాషలో అర్థం అవ్వాలంటే, అందుకు ఒక పాట చాలా మంచి ఉదాహరణ.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
అన్నిటా ముఖ్యమైన విషయాన్ని తెలపటానికి చాలా సంతోషిస్తున్నాము. ఇందులో వ్రాసిన ప్రతిఒక్క పాటలోనూ కోరస్ (chorus) సాహిత్యాన్ని కూడా అందిస్తునామని గర్వంగా తెలియజేస్తున్నాం. పాటలను ఎంతో ఇష్టంగా పాడాలి అనుకున్న వాళ్లకోసం, పాటలని ఎంతో బాగా పాడాలి అనుకున్న వాళ కోసం, మేము ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టటానికి ముఖ్య కారణం. అందుకే పాటలను సంపూర్ణంగా పాడటానికి మా వంతు కృషి చేసి ప్రతి పాటల్లోనూ కోరస్ ను కూడా అందిస్తున్నాము.
సందర్భాలు అనేకం. కొందరు ఒక పాటను బాగా పాడగలరు. కానీ, వారికి ఆ పాట సాహిత్యం సరిగా తెలిసి వుండదు. కొందరు పాట సాహిత్యం తెలిసినా, ఆ పాటను ఎలా పాడాలో తెలియక సతమతమౌతారు. కొందరు పాట ఎలా పాడాలో తెలిసినా, ఆ పాటలోని హావభావాలను వ్యక్తపరచలేరు. మరి కొందరు ఇవన్నీ తెలిసినా, ప్రదర్శన ఇచ్చే సమయంలో ఏవీ చెయ్యలేక తికమక పడతారు.అటువంటి కొన్ని ప్రశ్నలకు, కొన్ని సమస్యలకు ఈ మా సమాధానమే Lyrics Dew. మీరు చూసిన, చూస్తున్న,చూడబోయే సమస్యలకు జవాబులుగా, అటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా ఈ బ్లాగ్లో పాటల సాహిత్యాన్ని అందిస్తున్నాం. ఇందులో, ఒక పాటను ఎంత మధురంగా, ఎంత సులువుగా, ఎంత వినసొంపుగా పాడవచ్చో, అలాంటి సాహిత్యాన్ని మీకు అందిస్తున్నాం. ఈ బ్లాగును ఒక ప్రత్యకమైన అంశంతో మొదలు పెట్టి అందరి ప్రేక్క్షకులను, వారి పాటల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని, మా ప్రేక్షకులను అలరించటానికి రకరకాల పాటలతో ఈనాడు మీ ముందుకు తీసుకువచ్చాము . దీన్ని మీరు ఆదరిస్తారని, ఆదరింపజేస్తారని ఆశిస్తున్నాం.
" మీ ఊహలను నిజం చెయ్యటానికి, ఆశయాలను అందుకోవటానికి, వాటిని నిరూపించటానికి మావంతు పాటల సాహిత్యాన్ని అందిస్తున్నాం..... మీకోసం……..!!! "
మరెందుకు ఆలస్యం ....?? ఈ బ్లాగులో ఉన్న ప్రత్యేకమైన పాటలకి, అందులో ఉన్న సాహిత్యానికి మీ వంతు స్వరాన్ని చేర్చి మీ గళాన్ని, మీలోని గానానికి కలిపి, మీలో దాగివున్న గాయనీ గాయకులకు ప్రాణం పోయండి. పాట పాడటంలో మీకు ఉన్న ప్రత్యేకతను తెలపండి. ఈ మీ చిన్ని ప్రయాణం సాగించి, పాటల ప్రపంచంలో విహరించడానికి, పలువురి పాటలతో ప్రయాణం సాగించడానికి మా వంతు సహాయం అందిస్తున్నాము. మరికొన్ని అద్భుతమైన పాటలకోసం మేము అందించిన సాహిత్యానికి మీ గళాన్ని కలపడంకోసం మళ్ళీ మా పాటల రథసారథి అయిన Lyrics Dew కు విచ్చేయండి.
" ఎల్లప్పుడూ, మేము అందించే పాటల సాహిత్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మా పాటల సాహిత్యాన్ని ఆదరించి, మీ మంచి మనసుతో విస్తరింపజేస్తారని ఆశిస్తున్నాం."
Note: ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరినీ ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.
మీ గానం కోసం..., మా... Lyrics Dew...!!!
Lyrics Dew కు స్వాగతం...!!!
కృతజ్ఞతలు
మీ
Lyrics Dew & Team











********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************